హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

KMM: కామేపల్లి మండలం జాస్తిపల్లి బీసీ కాలనీ నుంచి ముచ్చర్ల ప్రధాన రహదారి వరకు ఇరువైపులా పెరిగిన పిచ్చిమొక్కలు, ముళ్లపొదలు, చెత్తాచెదారాన్ని సోమవారం తొలగించారు. వర్షాకాలంలో గ్రామస్థులు, కాలనీవాసులు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా రహదారి పరిసరాలను శుభ్రం చేసినట్లు సర్పంచ్ ధరావత్ నాగమణి తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.