తూ.గో: రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తెలిపారు. కోటికేశవరం, నాగంపల్లి గ్రామాల మీదుగా చినకొండేపూడి వరకు 6.2 కిలోమీటర్ల మేర రహదారి అభివృద్ధి పనులకు రూ. 5 కోట్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. రహదారి నిర్మాణంతో గ్రామాల మధ్య రాకపోకలు మెరుగుపడటంతో పాటు ప్రజలకు ప్రయాణ సౌకర్యం మరింత పెరుగుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
రహదారి అభివృద్ధికి రూ.5 కోట్లు: బత్తుల


