హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆకుపై ఆకట్టుకున్న 9 గణపతుల ఆకృతులు

SRD: నారాయణ ఖేడ్‌కు చెందిన లీఫ్ ఆర్టిస్ట్ గుండు శివకుమార్ వినూత్న భక్తి కళకు శ్రీకారం చుట్టారు. వినాయక నవరాత్రులు సందర్భంగా తొమ్మిది రోజుల పాటు వక్రతుండ, ఏకదంత, మహోదర, గజానన, లంబోదర, వికట, విఘ్నరాజ, ధూమ్రవర్ణ, హేరంబ గణపతి రూపాలను రావి ఆకులపై కత్తిరించి ఆ చిత్ర కళాఖండాలను ఇవాళ ఆవిష్కరించారు. నవ గణపతి ఆకృతులు విశేషంగా ఆకట్టుకున్నాయి.