హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాలుగో నంబర్ ప్లాట్‌ఫాం నిర్మించాలని ఆందోళన

మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో నాలుగో నంబర్ ప్లాట్‌ఫాం నిర్మించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి శంతన్ రామరాజు డిమాండ్ చేశారు. ఆదివారం స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు. ప్లాట్‌ఫాం లేక వృద్ధులు, గర్భిణులు, దివ్యాంగులు,బాధితులు మెట్లు ఎక్కి దిగుతూ ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి ప్లాట్‌ఫాం నిర్మించాలని కోరారు.