హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జ్ఞాన భారతం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి'

WNP: జిల్లాలో ఇళ్లలో, దేవాలయాలు, దర్గాలు, చర్చిల్లో భద్రపరిచిన పురాతన తాళపత్రాలు, చేతిరాత ప్రతులను సేకరించి స్కానింగ్ చేసి డిజిటలైజ్ చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. శతాబ్దాల నాటి భారతీయ జ్ఞానం, చరిత్రను భావితరాలకు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జ్ఞాన భారతం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.