హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో ఈకేవైసీ 78.89 శాతం పూర్తి: అదనపు కలెక్టర్

WNP: జిల్లాలో రేషన్‌ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ 78.89 శాతం పూర్తైంది. జిల్లాలో 336 చౌకధర దుకాణాలు, 1,83,568 రేషన్‌ కార్డులు ఉండగా.. 6.20 లక్షల మంది లబ్ధిదారుల్లో 4.89 లక్షల మంది ఈకేవైసీ పూర్తి చేసుకున్నారు. మిగిలిన వారు అక్టోబర్‌ నెలాఖరులోగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్ సూచించారు.