హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉరేసుకొని వివాహిత బలవన్మరణం

NGKL: వెల్దండ మండలం పెద్దపూర్ పంచాయతీ తుంకిబండతండాకు చెందిన మూడవత్ నీల (47) మద్యానికి బానిసై ఇంట్లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఎస్సై జి.యుగేంధర్ రెడ్డి కథనం ప్రకారం, ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన జరిగిందని, మృతురాలి కుమారుడు సంజయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.