హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెదక్ జిల్లాలో మోస్తరు వర్షపాతం

​మెదక్ జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా శివంపేటలో 59.3 మి.మీ, శంకరంపేట(ఆర్)లో 48.3 మి.మీ, చేగుంటలో 48 మి.మీ వర్షపాతం నమోదైంది. నర్సాపూర్, మాసాయిపేట, తూప్రాన్, ఎల్దుర్తి, విలేజ్ ప్రాంతాల్లోనూ మోస్తరు చినుకులు పడ్డాయి. గరిష్ఠ ఉష్ణోగ్రత 27.9°C గా, కనిష్ఠం 19.9°C గా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.