BHNG: చౌటుప్పల్‌లో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ ఛైర్‌పర్సన్ పావని సూచించారు. ఆదివారం సాయంత్రం 12వ వార్డులో ఇళ్లలోకి చేరిన నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. 14వ వార్డుతో పాటు తంగడపల్లి, వలిగొండ రోడ్లపై నిలిచిన నీటిని కాలువల్లోకి మళ్లించారు. వరద నీటి మళ్లింపునకు రెండు యంత్రాలను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
'వరదలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'


