WGL: నక్కలపల్లి నుంచి మామునూరు విమానాశ్రయానికి వెళ్లే 80 అడుగుల అంతర్గత రోడ్డు ఆక్రమణకు గురైందని రైతులు, గ్రామస్థులు ఆదివారం ఆందోళన చేపట్టారు. విమానాశ్రయ అభివృద్ధి నేపథ్యంలో రోడ్డుకు ఇరువైపులా అక్రమ వెంచర్లు, కబ్జాలు చేసి హద్దురాళ్లు ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. రోడ్డును ఆక్రమించి ప్రహరీలు నిర్మించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
విమానాశ్రయానికి వెళ్లే రోడ్డు ఆక్రమణ


