హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుంతల్లో నీరు.. వాహనదారుల అవస్థలు

NLG: మిర్యాలగూడ పట్టణంలోని డాక్టర్స్ కాలనీలో ప్రధాన రహదారులపై ఏర్పడిన గుంతల్లో వర్షపు నీరు నిలుస్తోంది. దీంతో రాకపోకలు సాగించేందుకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి రహదారులకు మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.