హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సాయి నర్సింగ్ హోమ్‌లో రోగి బంధువుల ఆందోళన

HYD: సైదాబాద్ సాయి నర్సింగ్ హోమ్‌లో చికిత్స పొందుతున్న రోగికి ఆక్సిజన్ తొలగించారని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. రూ.75 వేల బిల్లులో బకాయి రూ.25 వేలు చెల్లించలేదని వైద్యులు ఆక్సిజన్ తీసేశారని ఆరోపించారు. మెరుగైన వైద్యం కోసం వేరే ఆస్పత్రికి తరలించేలా చూడాలని, సదరు నర్సింగ్ హోమ్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.