ADB: ఇచ్చోడ పోలీస్ స్టేషన్ నూతన SHOగా ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ ఇంటెలిజెన్స్ విభాగం నుంచి ఆయన ఇక్కడికి బదిలీపై వచ్చినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఇప్పటివరకు ఇక్కడ SHOగా పనిచేసిన కె. నరేశ్ మల్టీజోన్-1 హైదరాబాద్ కార్యాలయానికి బదిలీ అయిన సందర్భంగా రిపోర్టు సమర్పించాలని ఐజీ చంద్రశేఖర్ ఆదేశించారు.
తెలంగాణ
ఇచ్చోడ SHO గా బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్ కుమార్


