హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

RR: వినాయక చవితి సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ నారాయణరెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడు ప్రజల జీవితాల్లోని ఆటంకాలను తొలగించి, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో పండుగను ఆనందంగా జరుపుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు.