హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ లోక్ అదాలత్‌లో 4,268 కేసుల పరిష్కారం

KNR: జాతీయ లోక్ అదాలత్‌లో కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 4,268 కేసులు పరిష్కారమైనట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. ప్రీ-లోక్ అదాలత్, ప్రధాన అదాలత్‌లో 451 ఎఫ్‌ఐఆర్ కేసులతో పాటు 3,817 మోటార్ వెహికల్, ఇతర కేసుల్లో రాజీ కుదిరినట్లు పేర్కొన్నారు. కేసుల పరిష్కారంలో కరీంనగర్ ట్రాఫిక్, వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లు ముందంజలో నిలిచాయని తెలిపారు.