హైదరాబాద్: 28°C
క్రీడలు

INSPIRATION: మిథాలీ రాజ్

క్రికెట్ అనగానే మగవాళ్ల ఆటగా చూసే రోజుల్లో చిన్న వయసులోనే బ్యాట్ పట్టిన మిథాలీ రాజ్.. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించారు. భారత మహిళా జట్టుకు దశాబ్దాల పాటు కెప్టెన్‌గా వ్యవహరించి ప్రపంచ వేదికపై దేశం తలెత్తుకునేలా చేశారు. పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా శిఖరాలను అధిరోహించవచ్చని ఆమె నిరూపించారు.