TG: మాజీ మంత్రి కొండా సురేఖ ఈరోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆమె కాంగ్రెస్ అధిష్ఠాన పెద్దలను కలవనున్నారు. పార్టీ తమకు అండగా ఉంటుందని, ఎక్కడికీ వెళ్లవద్దని హైకమాండ్ సూచించినట్లు ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమెకు కేబినెట్ హోదాతో కూడిన పదవి లేదా కీలకమైన ప్రత్యామ్నాయ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
వార్తలు
నేడు ఢిల్లీకి మాజీ మంత్రి కొండా సురేఖ


