హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసియా కప్ ఛాంపియన్‌గా భారత్

మహిళల టీ20 ఆసియా కప్‌ విజేతగా టీమిండియా అవతరించింది. ఫైనల్లో శ్రీలంకపై 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 183/5 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో శ్రీలంక 111 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో శ్రీచరణి 4, దీప్తి శర్మ 3 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు భారత బ్యాటర్లు స్మృతి మంధాన (59), షఫాలీ వర్మ (68) హాఫ్ సెంచరీలతో రాణించారు.