హైదరాబాద్: 28°C
క్రీడలు

'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా అభిషేక్

ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి టీ20లో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 32 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 82 పరుగులు చేసి ఔటయ్యాడు. తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడిన అభిషేక్ భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ఈ మ్యాచ్‌లో అతడు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. ఇది అతడికి టీ20ల్లో 6వ POM అవార్డు కావడం విశేషం.