హైదరాబాద్: 28°C
క్రీడలు

అభిషేక్ మెరుపులు.. భారత్ ఘన విజయం

ఆప్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. అభిషేక్ శర్మ (32 బంతుల్లో 82 పరుగులు) మెరుపులు మెరిపించడంతో 156 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 13.4 ఓవర్లలోనే ఛేదించింది. ఇషాన్ కిషన్ 40 పరుగులతో రాణించగా, సంజూ శాంసన్ (10) నిరాశపరిచాడు. ఆఫ్ఘన్ బౌలర్లలో నబీ రెండు వికెట్లు తీయగా, ఒమర్జాయ్ ఒక వికెట్ తీసుకున్నాడు.