హైదరాబాద్: 28°C
క్రీడలు

షెఫాలి, మంధాన మెరుపులు.. లంక టార్గెట్ ఎంతంటే..?

శ్రీలంకతో జరుగుతున్న మహిళల ఆసియాకప్ ఫైనల్లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు సాధించింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ (68), స్మృతి మంధాన (59) అర్ధశతకాలతో చెలరేగి తొలి వికెట్‌కు 129 పరుగుల భారీ భాగస్వామ్యం అందించారు. మిగతా బ్యాటర్లలో రిచా ఘోష్ (17), హర్మన్‌ప్రీత్ కౌర్ (14) రాణించారు. లంక బౌలర్లలో మిథాలీ, చమరి, ప్రబోధ తలో వికెట్ తీశారు.