హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయక చవితి శుభాకాంక్షలు: బండి సంజయ్

KNR: గణేశ్ ఉత్సవాలు ఐక్యతకు నిదర్శనమని కేంద్రమంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన హిందూ బంధువులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అని తెలిపారు. వర్షాల నేపథ్యంలో మండపాల వద్ద జాగ్రత్తలు వహించాలన్నారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలని, ప్రజల కష్టాలు తొలగి సుఖసంతోషాలు నిండాలని ఆకాంక్షించారు. మన సంప్రదాయాలను పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.