హైదరాబాద్: 28°C
క్రైమ్

పండుగ వేళ విషాదం.. పూల కోసం వెళ్లి..

AP: వినాయక చవితి పండుగ వేళ తూ.గో.జిల్లా కోరుకొండలో విషాదం చోటుచేసుకుంది. పండుగకు పూలు కోసేందుకు చెరువులో దిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. కోరుకొండలోని కొత్త చెరువులో యువకులు వీరబాబు(35), శివ(35) కూరుకుపోయినట్లు పోలీసులు గుర్తించారు. వీరి మరణంతో గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి.