హైదరాబాద్: 28°C
క్రైమ్

ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

TG: నాగర్‌కర్నూల్‌లో కరీం అనే వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. కరీమ్‌ను ప్రియుడితో కలిసి భార్య సలీమా ఈనెల 10న హత్య చేసినట్లు గుర్తించారు. వరసకు తమ్ముడు అయ్యే గౌస్ పాషాను హోటల్‌లో కరీం పనికి పెట్టుకున్నాడు. గౌస్‌పాషాతో కరీమ్ భార్య సలీమా వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో భర్త కరీమ్‌ను అడ్డు తొలగించుకోవాలని సలీమా భావించింది.