హైదరాబాద్: 28°C
తెలంగాణ

నారాయణపురంలో CMRF చెక్కులు పంపిణీ

KMM: బోనకల్ మండలంలోని నారాయణపురంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను గ్రామ సర్పంచ్ కే. శ్రీనివాసరావు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వివిధ అనారోగ్య కారణాలతో ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం దరఖాస్తు చేసుకున్న వారికి ఈ ఆర్థిక సాయం అందింది. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.