హైదరాబాద్: 28°C
తెలంగాణ

విగ్రహాల తరలింపుతో.. భారీ ట్రాఫిక్ జామ్

BDK: వినాయక చవితి సందర్భంగా విగ్రహాలను తరలించే క్రమంలో కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయం సమీపంలోని ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విగ్రహాలను తీసుకెళ్లే వాహనాలు, సాధారణ వాహనాలు ఒకేసారి రహదారిపై కి రావడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.