హైదరాబాద్: 28°C
క్రీడలు

షెఫాలీ మెరుపు హాఫ్‌ సెంచరీ

శ్రీలంకతో జరుగుతున్న మహిళల ఆసియాకప్ ఫైనల్లో భారత ఓపెనర్ షెఫాలీ వర్మ చెలరేగి ఆడుతోంది. అద్భుతమైన బ్యాటింగ్‌తో కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. మ్యాచ్‌లో భాగంగా 8 ఓవర్లకు భారత్ వికెట్ నష్టపోకుండా 78 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజులో షెఫాలీ వర్మ (53*), స్మృతి మంధాన (24*) పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు.