హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ పాలనపై పువ్వాడ అజయ్ ధ్వజమెత్తారు..!

KMM: గణేశ్వరం బీఆర్‌ఎస్ సభలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ హయాంలో 24 గంటల ఉచిత కరెంట్, సాగునీరు అందితే, ప్రస్తుత రేవంత్ రెడ్డి పాలనలో కరెంట్ కోతలతో రైతులు అల్లాడిపోతున్నారని మండిపడ్డారు. త్రీ-ఫేజ్ విద్యుత్ లేక మోటార్లు కాలిపోతున్నాయని, కాంగ్రెస్ మాటల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదని దుయ్యబట్టారు.