VKB: అయోధ్య నుంచి తెచ్చిన శ్రీరాముని పాదాలను తాండూరు మండలం అంతారంలో శంకర్ స్వామిజీ ఆధ్వర్యంలో భక్తులు ఘనంగా ఊరేగించారు. భక్తుల జైశ్రీరామ్ నినాదాలతో గ్రామం మారుమోగింది. అనంతరం హనుమాన్ దేవాలయంలో ఉంచిన స్వామివారి పాదాలను భక్తులు భక్తిశ్రద్ధలతో దర్శించుకుని పాదాభివందనం చేశారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు.
తెలంగాణ
ఘనంగా శ్రీరాముని పాదాల ఊరేగింపు


