హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ.270 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి: మంత్రి

కోనసీమ: రామచంద్రపురం నియోజకవర్గాన్ని రూ. 270 కోట్లతో అభివృద్ధి చేశామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. కాజులూరు మండలంలో రూ. 22.25 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. గ్రామీణ మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.