హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మిషన్ భగీరథ పైపులైన్ పగిలి వృథాగా పోతున్న నీరు

WGL: నర్సంపేట పట్టణంలోని ద్వారకపేట రోడ్డులో మిషన్ భగీరథ పైపులైన్ పగిలి నీరు వృథాగా పోతోంది. 6 నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. నీటి వృథాను అరికట్టి పైపులైన్కు మరమ్మతులు చేపట్టాలని పలుమార్లు కోరినా స్పందన లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.