MHBD: నెల్లికుదురు మండలం నైనాల గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి ఆకుల ప్రమీల ఇంట్లోకి వరద నీరు చేరింది. దీంతో నిత్యావసర సరుకులు, ఇతర వస్తువులు తడిసిపోయాయి. విషయం తెలుసుకున్న సర్పంచ్ యాసం సంధ్య- రమేష్ బాధితురాలి ఇంటిని సందర్శించి నష్టాన్ని పరిశీలించారు. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సాయం అందేలా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.
తెలంగాణ
'ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకుంటాం'


