హైదరాబాద్: 28°C
తెలంగాణ

కూతుళ్ల మృతిని తట్టుకోలేక తల్లి ఆత్మహత్య

BHPL: చిట్యాల మండలం గోపాలపురానికి చెందిన మంద జ్యోత్స్న తన ఇద్దరు కుమార్తెల మృతిని తట్టుకోలేక తీవ్ర మనోవేదనకు గురైంది. చిన్న కుమార్తె అనారోగ్యంతో మృతి చెందగా, పెద్ద కుమార్తె అలేఖ్య నాలుగు నెలల క్రితం మృతి చెందింది. అప్పటి నుంచి తీవ్ర ఆవేదనలో ఉన్న జ్యోత్స్న ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.