హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆశిరితల్లి ఉత్సవాలకు ఏర్పాట్లు

SKLM: ఎచ్చెర్ల మండలం చిన్నరావుపల్లి గ్రామంలో శ్రీ ఆశిరితల్లి గ్రామ దేవత ఉత్సవాలు ఈనెల 22వ తేదీన ఘనంగా నిర్వహించాలని కమిటీ సభ్యులు నిర్ణయించారు. ఆదివారం సాయంత్రం జరిగిన కమిటీ సమావేశంలో గ్రామ పెద్దలు ఈ మేరకు తీర్మానించారు. ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించి, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ప్రతీ ఏటా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.