హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు'

NLG: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నల్లగొండలో ఆయన ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. విఘ్నాలను తొలగించి, విజయాలను ప్రసాదించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, సౌభాగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు.