హైదరాబాద్: 28°C
తెలంగాణ

గురుకుల హాస్టల్‌లో రక్తపింజర కలకలం

SDPT: సిద్దిపేట అర్బన్ మండలం ఏన్సాన్‌పల్లి గురుకుల హాస్టల్‌లో రక్తపింజర పాము కలకలం రేపింది. ఆదివారం హాస్టల్ ప్రాంగణంలో సంచరిస్తున్న పామును చూసి విద్యార్థులు భయాందోళనకు గురై వెంటనే సర్పంచ్ నాగుల స్రవంతి ప్రశాంత్ గౌడ్‌కు సమాచారం ఇచ్చారు. సర్పంచ్ వెంటనే స్పందించి పాములు పట్టే నిపుణులను రప్పించి, ఆ విషసర్పంను సురక్షితంగా బంధించి అడవిలో వదిలిపెట్టించారు.