హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కొడవలి బౌద్ధ మహా క్షేత్ర పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి'

KKD: ప్రాచీన కొడవలి బౌద్ధ మహా స్థూపాన్ని ఆంధ్రప్రదేశ్ బౌద్ధ పర్యాటక సర్క్యూట్‌లో చేర్చి గుర్తింపు కల్పించాలని పరిరక్షణ సమితి ప్రతినిధులు ఎమ్మెల్యే పంతం నానాజీని కోరారు. కొడవలి పరిసరాల్లో మైనింగ్‌ కార్యకలాపాలతో చారిత్రక కొండలు, పురావస్తు అవశేషాలు , పర్యావరణానికి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.