NDL: డోన్ పురపాలక సంఘంలోని 36 వార్డులకు సంబంధించి 72 పోలింగ్ స్టేషన్ల తుది జాబితాను కమిషనర్ కె.నరేశ్ రెడ్డి ఆదివారం విడుదల చేశారు. టౌన్ ప్లానింగ్ అధికారి, సిబ్బందితో కలిసి ప్రకటన చేశారు. ఓటర్లకు ఇబ్బందులు లేకుండా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఓటర్లు ముందుగానే కేంద్రం వివరాలు తెలుసుకుని ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
డోన్ పోలింగ్ స్టేషన్ల తుది జాబితా విడుదల


