హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గణేష్ ఉత్సవాల్లో డీజేలు, లక్కీ డ్రాలకు అనుమతి లేదు'

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో గణేష్ మండపాల నిర్వాహకులతో పోలీసులు సమావేశం నిర్వహించారు. సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై శ్రీకాంత్ మాట్లాడుతూ.. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో డీజేలు, లక్కీ డ్రాలకు ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.