హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రారంభమైన వినాయక చవితి సందడి

GDWL: అలంపూర్ మండలంలోని గ్రామాల్లో వినాయక చవితి సందడి నెలకొంది. మండపాల్లో రేపు గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు యువత, కమిటీ నిర్వాహకులు చలువ పందిళ్లను సిద్ధం చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి గణపతులను వాడాలని పలు స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు సూచిస్తూ మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నాయి.