PDPL: గణేష్ ఉత్సవాల సందర్భంగా నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని పోలీసులు తెలిపారు. ధర్మారం ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వాహకులకు అవగాహన కల్పించారు. మండపాల ఏర్పాటుకు పోలీస్ శాఖ అనుమతి తీసుకోవాలని సూచించారు. శాంతి, భద్రతలకు విఘాతం కలిగించే కార్యక్రమాలు చేపట్టరాదని సూచించారు. నిమజ్జన సమయంలో నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
తెలంగాణ
'నిర్వాహకులు నిబంధనలు పాటించాలి'


