హైదరాబాద్: 28°C
తెలంగాణ

మండపాల వద్ద భద్రతా జాగ్రత్తలు పాటించాలి: ఎస్ఐ

KMM: వినాయక చవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆదివారం నేలకొండపల్లి ఎస్సై శ్రీనివాస్ రెడ్డి సూచించారు. మండపాల వద్ద భద్రతా జాగ్రత్తలు పాటించాలని, కమిటీ సభ్యులు తప్పనిసరిగా ఆన్‌లైన్ అనుమతులు పొందాలని స్పష్టం చేశారు. రాత్రి 10 గంటలు దాటితే మైకులు పూర్తిగా బంద్ చేయాలని, నిమజ్జనంలో డీజేలకు అనుమతి లేదని అన్నారు.