హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

20 మంది విద్యార్థులకు తప్పిన ప్రమాదం

పల్నాడు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. కొండవీడు ఘాట్ రోడ్‌లో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్‌ను స్కూల్ బస్సు ఢీకొంది. దీంతో ట్రాన్స్ ఫార్మర్ ధ్వంసమై విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ ఘటన సమయంలో బస్సులో దాదాపు 20 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. వారంతా సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.