KMM: ఏన్కూరు మండలం గార్లఒడ్డు గ్రామ శివారులో పేకాట ఆడుతున్న స్థావరంపై ఆదివారం రాత్రి పోలీసులు దాడి చేశారు. 8 మందిని అదుపులోకి తీసుకుని రూ.7,290 నగదు, 6 ద్విచక్ర వాహనాలు, 7 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ తెలిపారు.
తెలంగాణ
పేకాట స్థావరంపై దాడి 8 మంది అరెస్ట్


