హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమంగా తరలిస్తున్న PDS బియ్యం పట్టివేత

ASF: సిర్పూర్ (T)మండలం వెంపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర రైస్ మిల్ వద్ద ఎస్ఐ డి.సాగర్ ఆధ్వర్యంలో ఆదివారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆటోలో అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న 60 బ్యాగుల (15 క్వింటాళ్ల) PDS బియ్యం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ షేక్ షఫీ, అటెండర్ ఎండీ అహ్మద్, మిల్ యజమాని తుడురు వెంకటరమణపై కేసు నమోదు చేశామని తెలిపారు.