హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా తీజ్ పండుగ వేడుకలు

NZB: మోపాల్ మండలంలోని కస్బాగ్ తండాలో నిర్వహించిన తీజ్ పండుగ వేడుకల్లో మోపాల్ ఎస్ఐ సుష్మిత పాల్గొన్నారు. బంజారా మహిళలు, యువతులు సంప్రదాయ దుస్తుల్లో నిర్వహించిన ఆటపాటలు, నృత్యాలను ఆమె ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా బంజారా సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని, తీజ్ పండుగను ఆనందోత్సాహాలతో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.