కృష్ణా: పెద పారుపూడి మండలంలో ఆదివారం బీజేపీ సమావేశం జరిగింది. మండల అధ్యక్షుడు దొండపాటి శివాజీ మాట్లాడుతూ, గ్రామీణ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో ప్రతి కార్యకర్త కీలకమని అన్నారు. ముఖ్యఅతిథి కురుమద్దాలి ఫణికుమార్, ప్రతి గ్రామానికి బీజేపీని తీసుకెళ్లి, రానున్న స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'గ్రామస్థాయిలో బీజేపీని బలోపేతం చేయాలి'


