హైదరాబాద్: 28°C
తెలంగాణ

లోక్ అదాలత్లో 8,288 కేసులు పరిష్కారం

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్లో 8,288 కేసులు పరిష్కారమయ్యాయి. వీటిలో 1,595 ఎఫ్ఎఆర్, 2,171 ఈ-పెట్టి, 4,522 ఎంవీ యాక్ట్, 134 సైబర్ కేసులు ఉన్నాయి. సైబర్ కేసుల్లో బాధితులకు రూ.93,30,616 రిఫండ్ చేయాలని కోర్టు ఆదేశించింది. కేసుల పరిష్కారానికి కృషి చేసిన పోలీసులను సీపీ ఎన్. శ్వేత అభినందించారు.