హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు గంగారంలో పాలాభిషేక కార్యక్రమం

MHBD: గంగారం(M)లో సోమవారం ఉదయం 10 గంటలకు పాలాభిషేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు ముడిగ వీరభద్ర పోతయ్య తెలిపారు. గ్రామపంచాయతీల సొంత ఆదాయాన్ని నేరుగా గ్రామాభివృద్ధికి వినియోగించుకునే అవకాశం కల్పించిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్కకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు హాజరుకావాలన్నారు.