హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వినాయక చవితికి వేములవాడ మార్కెట్‌లో సందడి

SRCL: వేములవాడ పట్టణ మార్కెట్‌లో వినాయక చవితి పండుగ సందర్భంగా సందడి నెలకొంది. గణనాథుడి పూజకు అవసరమైన సామగ్రి, వివిధ రకాల పండ్లు, పూలు, పూజా వస్తువులు కొనుగోలు చేసేందుకు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో మార్కెట్‌కు తరలివచ్చారు. దీంతో మార్కెట్ ప్రాంతాలు కొనుగోలుదారులతో కిక్కిరిశాయి. పండుగ నేపథ్యంలో పూలు, పండ్లు, పూజా సామగ్రికి డిమాండ్ పెరిగింది.